`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆన్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్ లో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ తో తెరకెక్కుతున్న 30వ ప్రాజెక్ట్ ఇది. దీనికి `దేవర` అనే టైటిల్ ను లాక్ చేసింది. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే.. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది.ఈ సంగతి పక్కన పెడితే.. ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో అనేక చిత్రాలను రిజెక్ట్ చేశాడు. ఈ లిస్ట్ లో కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అయితే అలా బ్లాక్ బస్టర్ అయిన చిత్రాల్లో `కిక్‌` ఒకటి. మాస్ మహారాజా రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్.ఆర్.వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. వక్కంతం వంశీ కథ అందించాడు. జయప్రకాశ్ రెడ్డి, సాయాజీ షిండే, శ్యామ్, బ్రహ్మానందం తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. థమన్ స్వరాలు అందించాడు. 2009 లో విడుదలైన కిక్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రవితేజ ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేశాడు.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. కిక్ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదు. మొదల వక్కంతం వంశీ ఈ కథను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వినిపించాడట. కానీ, ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్ల కథ నచ్చినప్పటికీ ఎన్టీఆర్ కిక్ మూవీని సున్నితంగా తిరస్కరించాడట. ఆ తర్వాత ఈ మూవీ కథ రవితేజ వద్దకు వెళ్లింది. కిక్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రవితేజ ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత అనవసరంగా బంగారం లాంటి కథను రిజెక్ట్ చేశానని ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారట.

మరింత సమాచారం తెలుసుకోండి: