ఈ అమ్మడు అందానికి తెలుగు సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అయ్యారు. కోర చూపుల తో ఈ అమ్మడు అందరి మతి పోగొట్టేసింది అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ అమ్మడికి ఇండస్ట్రీలో ఒక్క సరైన హిట్టు మాత్రం లభించడం లేదు. గతంలో రవితేజతో కిలాడి అనే సినిమాలో నటించి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక మొన్నటికి మొన్న గోపీచంద్ సరసన రామబాణం అనే సినిమాలో నటించింది ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే వరుస ప్లాపులతో సతమతమవుతున్నప్పటికీ.. ఈ అమ్మడిని ఊహించని అదృష్టం వరించింది.
ఏకంగా బంపర్ ఆఫర్ కొట్టేసింది డింపుల్ హాయతి. కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో డింపుల్ హయాతికి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం డింపుల్ ను సంప్రదించారట మేకర్స్. దీంతో డింపుల్ హయాతి కూడా ఓకే చెప్పేసిందట. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది అన్న టాక్ ఇండస్ట్రీలో ఊపందుకుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి