ఉపాసన డెలివరీ కంటే ముందుగానే ఈ హాస్పిటల్ లోని తన రూమ్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. హాస్పిటల్లోని ఆ గది ప్రకృతి వాతావరణాన్ని తలపిస్తూ ప్రకృతి ఒడిలో ఉండే విధంగా తీర్చిదిద్దారు.దీనికోసం ప్రత్యేకంగా డిజైనర్స్ ఎంతో కష్టపడ్డారు. తాను హాస్పిటల్ లో ఉన్న ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలగాలన్న ఉద్దేశంతోనే ఉపాసన ఇలా తన గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలుస్తుంది.తన బేబీ పుట్టగానే చుట్టూ పక్షులు, జంతువులు బొమ్మలు ఉండేలా కర్టెన్స్ డిజైన్ చేయించారు. అచ్చం ఒక అడవిని తలపించేలా డిజైనర్స్ తన గదిని తయారు చేశారు.
ఇలా తన బిడ్డ కళ్ళు తెరిచి చూడగానే ఇవన్నీ తనకు కనిపించే విధంగా తన రూమ్ డిజైన్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియోని షేర్ చేసినటువంటి ఉపాసన అమ్రాబాద్ ఫారెస్ట్ వేద వైద్యం ద్వారా ప్రేరణ పొందిన ఈ సుందరమైన ప్రదేశంలో నేను బిడ్డకు జన్మనివ్వడం నా క్లీన్ కారను పెంచడం నేను ఎంత ఆనందపడ్డానో మీకు చెప్పలేను ధన్యవాదాలు పవిత్ర రాజారామ్ అంటూ ఉపాసన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఉపాసన తన బేబీ కోసం ప్రత్యేకంగా ఇలా డిజైన్ చేయించడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి