తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో నితిన్ ఒకరు. నితిన్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఏ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను అందుకుంది. ఇలా మాచర్ల నియోజకవర్గం మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను అందుకున్న ఈ యువ నటుడు ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇది ఇలా ఉంటే ఇంత కాలం పాటు ఈ మూవీ కి  చిత్ర బృందం టైటిల్ ను అనౌన్స్ చేయలేదు. దానితో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు టైటిల్ లేకుండానే మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తూ వచ్చారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మరియు ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది. అలాగే ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ మరియు విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లో నితిన్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: