ప్రముఖ బుల్లితెర ఛానల్ ఈటీవీలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తూ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న ఇప్పటికే ఈ కార్యక్రమంలో ఎంతోమంది కమెడియన్లుగా చేసి సినిమాలలో అవకాశాలు దక్కించుకొని సక్సెస్ బాట పడుతున్నారు. ఇక ఇప్పటికే జబర్దస్త్ లో కమెడియన్లుగా పనిచేసి.. వెండితెరపై హీరోలుగా కొంతమంది కొనసాగుతుండగా ఇప్పుడు మరొక కమెడియన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ఆయన ఎవరో కాదు ఇమ్మానుయేల్. ఒక్క టీవీ షోల ద్వారానే కాకుండా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఇమ్మానుయేల్ ఇప్పుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన స్నేహితులతో కలిసి ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నారు ఇమ్మానుయేల్.

ఈ వెబ్ సిరీస్ కి జబర్దస్త్ బాబు రచన దర్శకత్వం వహిస్తుండగా.. ఇమ్మానుయేల్ కి జోడిగా విజయ విజ్జు నటించింది. ఇక ఇందులో పుష్పమ్మ, రాజు తాత ,మహేష్, మార్క్ , జయరాం, దివాకర్, అనూష, గోపి తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు. వెంకీ వీణ పాటలు నేపథ్య సంగీతం స్వరపరచగా, హేమంత్ చిన్నోడా సినిమా ఆటోగ్రఫీ అందించినట్లు సమాచారం. ఇక ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను ఇమ్మానుయేల్ నిన్న రాత్రి విడుదల చేశారు. ఇందులో ఇమ్మానుయేల్ గ్రామ వాలంటీర్ గా కనిపించాడు. అదే గ్రామంలోని అమ్మాయిని ప్రేమలో పడేసే ప్రేమ వాలంటీర్ గా మారిపోయాడు.పక్క పల్లెటూరి నేపథ్యంలో ఒక అందమైన ప్రేమకథగా ఈ సిరీస్ ని రూపొందించినట్లు మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో దీనికి తోడు ఇమ్మానుయేల్ మార్క్ కామెడీ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ తో ఇమ్మానుయేల్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: