తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మూల స్తంభాలలో ఒకరైన అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున,తొలిచిత్రం 'విక్రమ్' తోనే సూపర్ హిట్ ని అందుకొని తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నాడు.ఆ తర్వాత ఈయన చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. నాగేశ్వరరావు గారి అబ్బాయికి అసలు నటనే రాదు అని విమర్శలు చేసేవారు అప్పట్లో. ఆ విమర్శలన్నీ పాజిటివ్ గా తీసుకొని, తనలోని లోపాలను సరి చేసుకొని సినిమాలు చేసి హిట్టు మీద హిట్టు అందుకున్నాడు. అంతే కాదు ఏ హీరో కూడా చేయనన్ని ప్రయోగాలు చేసి సక్సెస్ లు అందుకున్న ఏకైక హీరో కూడా నాగార్జున మాత్రమే.ఆయన కెరీర్ టచ్ చెయ్యని జానర్ అంటూ ఏది మిగలలేదు. బహుశా ఇన్ని జానర్స్ కి సూట్ అయ్యే హీరో ఇండియా లోనే ఉంది ఉండక పోవచ్చు అని విశ్లేషకుల అభిప్రాయం.

ఇకపోతే నాగార్జున కి 60 ఏళ్ళ వయస్సు దాటినా కూడా ఇప్పటికీ అంత చార్మ్ తో వెలిగిపోవడం ఎలా సాధ్యం అనేది చాలా మందికి అర్థం కాదు. ఏదైనా ఇంటర్వ్యూస్ కి వచ్చినప్పుడు కూడా ఆయనని ఈ విషయం లో అడిగినప్పుడు, ఏమి లేదండి మనసు ప్రశాంతం గా ఉంచుకుంటే ఎప్పటికీ నిత్య యవ్వనం తోనే ఉంటాము, నా బ్యూటీ సీక్రెట్ ఇదే అని అంటుంటాడు. బయట కూడా నాగార్జున ని మనం ఇప్పటి వరకు నవ్వుతూ ఉండడమే చూసాము కానీ, ఆయన కోపం లో ఉన్నట్టు కానీ, టెన్షన్ లో ఉన్నట్టు కానీ ఇది వరకు మనం ఎప్పుడు కూడా చూడలేదు.అయితే నాగార్జున కూడా అప్పుడప్పుడు ఒత్తిడి కి లోను అవ్వడం , కోపం తో ఉండడం వంటివి ఇంట్లో ఉన్నప్పుడు చాలా సార్లు జరిగేవి అని అక్కినేని అఖిల్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

అయితే నాగార్జున కోపం లో ఉన్న సమయం లో ఏమి చేస్తాడు అని యాంకర్ అడిగినప్పుడు , ఆయనకీ మూడ్ బాలేని సమయం లో కిచెన్లోకి దూరి వంట చేస్తాడు. ఎంతో రుచికరంగా చెయ్యడం నాన్న స్పెషాలిటీ, ప్రతీ ఒక్కరికీ ఇష్టమైన వంటకాలను వండుతాడు. ఎప్పుడైనా నేను షూటింగ్ నుండి వచ్చినప్పుడు నాన్న కిచెన్ లో ఉంటే మాత్రం నాకు అర్థం అయిపొతాది ఆయన చాలా కోపం లో ఉన్నాడని అంటూ అక్కినేని అఖిల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. చివరికి కోపం లో ఉన్నప్పుడు కూడా తన ద్వారా ఎలాంటి నష్టం కలగకుండా, దానిని కూడా నలుగురికి ఉపయోగపడే విధంగా మార్చుకున్న నాగార్జున అలవాటు ని చూసి అభిమానులు ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: