టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు సైతం వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే నటుడు శర్వానంద్ వివాహం చేసుకోగ.. మెగా హీరో నాగబాబు, లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక హీరో మాస్ కా దాస్ విశ్వక్ సెన్ కూడా వివాహానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.. ప్రస్తుతం విశ్వక్ వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.. తాజగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. ఈ పోస్టులో తన పెళ్లి గురించి అప్డేట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది


ఇన్ని రోజుల నుంచి తన పైన ప్రేమ చూపించిన ప్రతి ఒక్క అభిమానులకు శ్రేయోభిలాషులకు సైతం ఎప్పుడు రుణపడి ఉంటాను ఇప్పుడు మీ అందరితో ఒక విషయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను తన జీవితంలో మరొక ఘట్టాన్ని తను ప్రారంభించబోతున్నట్లుగా తెలియజేశారు.. నేను కుటుంబాన్ని మొదలుపెట్టబోతున్నాను అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఆగస్టు 15న తెలియజేస్తాను అంటూ తెలియజేశారు. ఈ పోస్ట్ చుస్తూ ఉంటే పెళ్లి వార్త లాగే ఉందంటూ అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు.


పూర్తి వివరాలు తెలియాలి అంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.. విశ్వక్ సినిమాలో విషయానికి వస్తే.. గామి షూటింగ్ పూర్తి అయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో విశ్వక్ అఘోరా గా కనిపించబోతున్నారని సమాచారం. హీరోయిన్గా చాందిని చౌదరి నటిస్తోంది. మరో సినిమా విషయానికి వస్తే కొత్త డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. 11వ సినిమా విషయానికి వస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ తో కృష్ణ చైతన్య అనే దర్శకుడు తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అంజలి నేహా శెట్టి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం విశ్వక్ పెళ్ళి కి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: