బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే కాంబినేషన్ లో వస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ఫైటర్.ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా వచ్చే సంవత్సరం 2024 జనవరి 25 న రిలీజ్ కాబోతున్నట్లు ఆ మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌లో హృతిక్, దీపిక పదుకునే ఇంకా అనిల్ కపూర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్‌గా నటిస్తున్నారని ఇంట్రడ్యూస్ చేశారు.స్పిరిట్ అఫ్ ఫైటర్.. వందేమాతరం..సుజలం,సుఫలం ఇంకా మలయజ శీతలం..భారతదేశ గర్జనను వినడానికి రెడీగా ఉండండి అంటూ ఆడియన్స్ కు అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్.షారుఖ్ పఠాన్, హృతిక్ వార్ మూవీస్ ను డైరెక్ట్ చేశారు డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్. ఇప్పడు దేశభక్తి నేపధ్యం లో వస్తోన్న ఫైటర్ మూవీపై కూడా అంచనాలు చాలా భారీగా ఉన్నాయి.ఈ సినిమాలో హృతిక్ రోషన్‌ పాటీ అనే IAF ఆఫీసర్ పాత్రను పోషించాడు. 


పైలట్ జి-సూట్‌లో కనిపిస్తోన్న హృతిక్ రోషన్ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అలాగే హృతిక్ రోషన్ ట్విట్టర్లో వీడియో షేర్ చేస్తూ 'స్పిరిట్ ఆఫ్ ఫైటర్'.. వందేమాతరం.. ఇక భారతదేశ  గణతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్లలో కలుద్దాం. ఫైటర్ 25 జనవరి 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.' అని హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు.డైరెక్టర్ సిద్ధార్ద్ ఇంకా హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఇది మూడవ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి నుండి వచ్చిన బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు బాక్సాపీస్ వద్ద పెద్ద సక్సెస్ అయ్యాయి.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినాట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని వయాకామ్ 18 నిర్మిస్తోంది.2024 జనవరి 25 వ తేదీన వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రీలిజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: