ఇక ఇతను ప్రతి సినిమా కోసం చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ఒక సెన్సేషన్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇటీవల రజనీకాంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ సినిమాకు కూడా అనిరుద్ అందించిన మ్యూజిక్ అయితే సినిమాకు ప్రాణం పోసింది. ప్రేక్షకులందరికీ విజిల్స్ కొట్టేలా చేసింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తలైవా ఎలివేషన్స్ సీన్స్ కి అనిరుద్ మ్యూజిక్ తోడై ఇక సినిమా సెన్సేషన్ అయింది అని చెప్పాలి. ఇక జైలర్ బ్లాక్ బస్టర్ సాధించి ఇప్పటికీ 350 కోట్లు వసూళ్లతో ఇంకా దూసుకుపోతూనే ఉంది.
ఇలాంటి సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రజనీకాంత్ అనిరుద్ లకు చాలా దగ్గర బంధుత్వం ఉంది అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఎవరో కాదు రజినీకాంత్ కు స్వయానా అల్లుడట. రజనీకాంత్ భార్య లతకు స్వయానా మేనల్లుడు. ఆమె తమ్ముడు అయినా తమిళ యాక్టర్ రవి రాఘవేంద్రకు కుమారుడు ఈ అనిరుద్. ఇలా సూపర్ స్టార్ రజినికి దగ్గర బంధువు అన్నది తెలుస్తుంది. ఇక రజనీకాంత్ చిన్నప్పుడు అనిరుద్ ను ఎత్తుకున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంత బంధుత్వం ఉంది కాబట్టే రజిని స్టేజ్ మీద అనిరుద్ కి ఏకంగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి