ఈ సంవత్సరం అనేక తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన అపజాయలను అందుకొని భారీ నష్టాలను మిగిల్చాయి. అలా ఈ సంవత్సరం విడుదల అయ్యి భారీ నష్టాలను ఎదుర్కొన్న టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించగా ... తమన్నామూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఘోరమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు 52 కోట్ల మేర నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి 50 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

దేవ్ మోహన్ ... సమంత ప్రధాన పాత్రల్లో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం మూవీ కి దాదాపుగా 50 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

అక్కినేని అఖిల్ హీరోగా సాక్షా వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ కి 33 కోట్ల మేర నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి హిప్ హాప్ తమిజ సంగీతం అందించగా ... అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా సముద్ర కని దర్శకత్వంలో రూపొందిన "బ్రో" సినిమాకు 31 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: