అయితే ఎట్టకేలకు ఆగస్ట్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ను అందుకొని కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాడు కార్తికేయ. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. రామ్ చరణ్ గురించి చెప్పమని ఒక నెటిజన్ అడగగా.. లక్కీ ఛార్మ్ అంటూ బదులిచ్చాడు. ఇంతలోనే మరో నెటిజన్ చరణ్ సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వస్తే.. చేస్తారా? అని ప్రశ్నించగా.. మంచి స్కోప్ ఉన్న పాత్ర అయితే కచ్చితంగా చేస్తానని తెలిపారు కార్తీకేయ. ఈ క్రమంలోనే ఒక యువతి సోషల్ మీడియా వేదికగా కార్తికేయను బెదిరించింది.
రిప్లై ఇవ్వకపోతే చేయి కోసుకుంటాను అంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఇది చూసి భయపడిన కార్తికేయ వెంటనే రిప్లై ఇచ్చాడు. అమ్మో వద్దు వద్దు అంటూ రిప్లై ఇవ్వగా.. థాంక్యూ అంటూ సదరు యువతి రిప్లై ఇచ్చింది. అయితే ఈ బ్లాక్ మెయిల్ అంతా సరదాగానే సాగినట్లు యువతి షేర్ చేసిన ఫోటో చూస్తే తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి