బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం హైయెస్ట్ నెట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

పఠాన్ : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం భారీ అంచనాల నడుమ హిందీ , తెలుగు , తమిళ భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 524.55 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

బాహుబలి 2 : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 511 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాలో అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా నటించారు.

గడార్ 2 : ఈ సినిమా కేవలం 16 రోజుల్లోనే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 440 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది.

కే జి ఎఫ్ చాప్టర్ 2 : టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో యాష్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 435.20 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

దంగల్ : మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరో గా రూపొందిన దంగల్ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 374.45 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: