పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో "బ్రో" అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా వినోదయ సీతం అనే తమిళ మూవీ కి అధికారికా రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహించగా ... సాయి తేజ్ కి జోడిగా ఈ మూవీ లో కేతికా శర్మ నటించింది. ప్రియా ప్రకాష్ వారియర్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. దానితో ఈ మూవీ కి భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తన ఫైనల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ మూవీ.కి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు వచ్చాయో ... అలాగే ఎన్ని కోట్ల నష్టాలు వచ్చాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 21.06 కోట్లు , సీడెడ్ లో 7.02 కోట్లు , యు ఏ లో 7.02 కోట్లు , ఈస్ట్ లో 4.88 కోట్లు , వెస్ట్ లో 4.48 కోట్లు , గుంటూరు లో 4.55 కోట్లు , కృష్ణ లో 3.64 కోట్లు , నెల్లూరు లో 1.80 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపు కొని 6.25 కోట్లు , ఓవర్ సీస్ లో  7.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 68.35 కోట్ల షేర్ , 115.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 97.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... 98.50 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఇకపోతే ఓవరాల్ గా ఈ మూవీ కి 30.15 కోట్ల నష్టాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: