టాలీవుడ్ పవర్ స్టార్ జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు తన 52వ  పుట్టినరోజుని చేసుకుంటున్నారు. పవన్ బర్త్ డే కానుకగా ఆయన ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఓజి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.యువ దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఏదో అద్భుతం సృష్టిస్తున్నాడు అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ లో పెరిగిపోయాయి. పైగా దీనికి తోడు నిర్మాణ సంస్థ అప్డేట్స్ తో హైప్ ఆకాశాన్ని తాకింది. ఎట్టకేలకు గ్లింప్స్ రానే వచ్చింది.ఈ గ్లింప్స్ ఆధ్యంతం అద్భుతం అనే చెప్పాలి. గ్లింప్స్ లో ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్.. పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న రక్త పాతం ఇంకా వీటన్నింటికి తోడు అర్జున్ దాస్ తన పవర్ ఫుల్ వాయిస్ తో ఇస్తున్న వాయిస్ ఓవర్ టీజర్ లో హైలైట్స్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ పాత్రకి అర్జున్ దాస్ ఇస్తున్న ఎలివేషన్ కూడా టెరిఫిక్ గా ఉంది.దీనికి తోడు పవన్ కళ్యాణ్ రక్తపాతం సృష్టిస్తూ కత్తిని చేతబట్టి చిన్న సైజు యుద్ధమే చేస్తున్నాడు.


పవన్ కళ్యాణ్ స్వాగ్, ఆయన స్టైల్ ఎప్పటిలాగానే ఫ్యాన్స్ ని కట్టిపడేసే విధంగా ఉన్నాయి.ఇంకా యంగ్ డైరెక్టర్ సుజీత్ టేకింగ్ కూడా మరో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉంది.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఇచ్చిన బిజియం కూడా నిజంగా అదుర్స్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఓజి గ్లింప్స్ ఉంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ నటిస్తోంది.ఇది ఇలా ఉంటే మరో వైపు ఆగిపోయింది అనుకున్న పవన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు నుండి కూడా అదిరిపోయే పోస్టర్ ని రీలీజ్ చేశారు మూవీ మేకర్స్. బిగుతు గడ్డం తో శత్రువులను చీల్చి చెండాడి పౌరుషంగా చూస్తూ వస్తున్నా యుద్ధ వీరుడిగా కనబడ్డాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పోస్టర్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపాడు దర్శకుడు క్రిష్. ఈ సినిమాని ఎ. వి. ఎమ్. బ్యానర్ పై ఎ.యం. రత్నం నిర్మిస్తున్నారు.ఇందులో హీరోయిన్ గా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: