ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా వాయిదా అయితే టాలీవుడ్ లో ఎన్నో విచిత్రమైన పరిణామాలకు దారితీసింది అని చెప్పాలి ఒక రకంగా సలార్ సినిమా వాయిదా వినాయక చవితికి డబ్బింగ్ సినిమాలతోనే వినాయకుడికి నైవేద్యం పెట్టేలా చేసిందని కొంతమంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సలార్ సినిమా విడుదల వాయిదా పడకపోయి ఉంటే స్కంద సినిమా సెప్టెంబర్ 15వ తేదీన వచ్చేసేది. అయితే సలార్ సినిమా వదిలేసిన తేదీ పై ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు కర్చిప్ వేసుకుని ఉన్నాయి.
దీంతో ప్రస్తుతం వినాయక చవితికి కొత్త సినిమాకి వెళ్లాలి అనుకునే ప్రేక్షకులకు చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీ లాంటి డబ్బింగ్ సినిమాలే అందుబాటులో ఉన్నాయి అయితే చంద్రముఖి 2 సినిమాకి ఇప్పటికే మంచి బజ్ ఉంది. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న టైం ట్రావెల్ మూవీ మార్క్ ఆంటోనీ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే చంద్రముఖి 2 రైట్స్ ని దిల్ రాజు కొన్నారు. స్కందా రైట్స్ ని కూడా ఆయనే కొనుగోలు చేశారు దీంతో ఇక థియేటర్లు సర్దేబాటు చేయలేక స్కంద సినిమాను వెనక్కి వెళ్లేలా చేశారు. ఇప్పుడు చంద్రముఖి 2 అదే రేటుకు వెళ్ళడంతో స్కందా ముందుకు రావచ్చు అని అంటున్నారు దీంతో ఇక ఏ సినిమాని ముందుకు తీసుకురావాలి అనే విషయంపై దిల్ రాజు కూడా ఆలోచనలో పడిపోయారట స్కంద మూవీ కాస్త ముందుకు వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి