ఇక ఇప్పుడు కథలు ఎంపిక విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. అయితే ఇక ఇప్పుడు నరేష్ నటిస్తున్న సినిమా ఏదైనా విడుదలవుతుంది అంటే చాలు.. ఈ సినిమాలో ఏదో కొత్తదనం ఉండబోతుంది అని అటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల నరేష్ నటించిన మారేడుపల్లి ప్రజానికం లాంటి సినిమాలో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. నిర్మాతలకు కూడా లాభాలు తెచ్చిపెట్టాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు సభకు నమస్కారం అనే సినిమా చేస్తున్నాడు నరేష్. ఇదిలా ఉంటే ఒక హీరో సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించేందుకు కూడా సిద్ధమయ్యాడట.
ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ బిన్ని దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న నా స్వామి రంగా సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం అల్లరి నరేష్ ను సంప్రదించారట. చిన్నప్పుడు నుంచి నరేష్ అక్కినేని నాగార్జునకు వీరాభిమాని. దీంతో నాగార్జున సినిమాలో స్పెషల్ రోల్ కోసం అడగ్గానే ఓకే చెప్పేసాడట ఇక ఈ పాత్ర కోసం తన సినిమా డేట్లు కూడా అడ్జస్ట్ చేసుకున్నాడట. త్వరలోనే నాగార్జున సినిమాలో అల్లరి నరేష్ సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలు కాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా గతంలో అల్లరి నరేష్ మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమాలో కూడా ఒక కీలకపాత్రలో కనిపించి అలరించాడు అన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి