సరైన విజయం లేక కరువులో ఉన్న బాలీవుడ్ కి ఈ ఏడాది షారుఖ్ ఖాన్ ఎవరు ఇవ్వలేని కిక్ ను ఇచ్చాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ అనే సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి ఏకంగా 1000 కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. తాజాగా ఎప్పుడూ జవాన్ సినిమాతో మరొకసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ తమిళం వంటి భాషల్లో విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా చూడడానికి జనాలందరూ క్యూ కడుతున్నారు.

దానికి తగ్గట్టుగానే మొదటి రోజు సుమారుగా 130 కోట్లకు పైగానే రాబట్టింది ఈ సినిమా. ఇక ఇది బాలీవుడ్ మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ అని కూడా చెప్పాలి. అయితే ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఆయన పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ సైతం లభించింది. రెండు డిఫరెంట్ గెటప్స్ తో ఈ సినిమాలో విజయ్ సేతుపతి తన నటన ఎలా ఉంటుందో చూపించాడు. అంతేకాదు కేవలం ఆయన వల్లనే ఈ సినిమాకి తమిళంలో కూడా మంచి మార్కెట్ లభించింది అని అంటున్నారు అక్కడి జనాలు.

ఫర్జి వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో సైతం మంచి క్రేజ్ దక్కించుకున్న ఆయన ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా హీరో లెవెల్లో పాపులారిటీని దక్కించుకున్నాడు. అయితే తాజాగా ఈయనకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జవాన్ సినిమాలోని విజయసేతుపతి పాత్రని మొదట టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని చేయాల్సి ఉందట. వాటికి సంబంధించిన ఫోటోషూట్లను కూడా జరిపారట. కానీ  ఓల్డ్ ఏజ్ లుక్ లో కనిపిస్తే నాని లుక్ బాగుండదేమో అన్న ఆలోచనతో డైరెక్టర్ ఈ విషయాన్ని నానికే చెప్పాడట. ఇక నాని సైతం అలా అనిపిస్తే నేను ఈ పాత్రకి కరెక్ట్ కాదు అని ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. అలా నానికి ఈ ఛాన్స్ మిస్సయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: