జాతిరత్నాలు సినిమాతో తెరంగేట్రం చేసిన హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఆ సినిమాతో హిట్ అందుకోగా అప్పటి నుంచి ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. సినిమాలతో పాటుగా ఏమాత్రం ఛాన్స్ దొరికినా సరే ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది ఫరియా. తనకు వచ్చిన ఆడియన్స్ అటెన్షన్ ని మరింత పెంచుకునేందుకు అమ్మడు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఫరియా లేటెస్ట్ గా ప్రిన్సెస్ ఆఫ్ జంగిల్ అంటూ ఒక క్రేజీ ఫోటోస్ షేర్ చేసింది. ప్రిన్సెస్ ఆఫ్ జంగిల్ కానీ అది జంగిల్ కాదు ఒక హోటల్ నేను ప్రిన్సెస్ కూడా కాదు సో క్యాప్షన్ నాట్ వాలిడ్ అంటూ తన మీద తానే సెటైర్ వేసుకుంది అమ్మడు.

జాతిరత్నాలు తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫరియా రాబోతున్న సినిమాలతో అయినా హిట్ అందుకోవాలని చూస్తుంది. ఆడియన్స్ లో ఐడెంటిటీ సంపాదించిన ఫరియా సినిమాల సెలక్షన్ లో కాస్త తెలివి ప్రదర్శిస్తే చాలు ఫాం లోకి వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ లో తన సత్తా చాటాలని చూస్తున్న ఫరియాకు ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లాలని అనుకుంటుంది ఫరియా అందుకే ఇక్కడే రకరకాల ప్రయత్నాలు చేయాలని ఫిక్స్ అయ్యింది.

సినిమాలు ఎలా ఉన్నా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో అమ్మడు తన సత్తా చాటాలని చూస్తుంది. లేటెస్ట్ గా ప్రిన్సెస్ ఆఫ్ జంగిల్ అంటూ ఫరియా షేర్ చేసిన ఫోటోస్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సరైన ఛాన్స్ రావాలే కానీ ఫరియా టాప్ రేంజ్ కి వెళ్లడం పక్కా అని అంటున్నారు ఆడియన్స్. మరి ఆ అవకాశం ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అన్నది చెప్పడం కష్టం. ఫరియా మాత్రం అయితే సినిమాలు లేదంటే ఫోటో షూట్స్ అన్నట్టుగా అదరగొట్టేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: