నాగార్జున హీరోగా రూపొందిన సూపర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి ఈ మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న అనుష్క గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే సూపర్ సినిమా తర్వాత ఈ నటికి అనేక క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ హాట్ బ్యూటీ అరుంధతి లాంటి సినిమాలో తన నటనతో కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించింది.

ఇలా గ్లామర్ తో పాటు నటనతో కూడా ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాల పాటు అలరించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాల్లో నటించడం లేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత అనుష్క తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. కొన్ని రోజుల క్రితమే విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇకపోతే అనుష్క మరికొన్ని రోజుల్లో చిరంజీవి హీరోగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

కాకపోతే తాజాగా వశిష్ట ఈ మూవీ లో చిరంజీవి పక్కన హీరోయిన్ పాత్ర ఏమి ఉండదు అని ... కాకపోతే చాలా మంది నటీమణులు ఈ సినిమాలో నటిస్తారు అని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో అనుష్క ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ లో స్లిమ్ గా కనబడడం కోసం ప్రస్తుతం జిమ్ లో అనుష్క చాలా గంటల పాటు కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ బృందం మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమాలో అనుష్క కన్ఫామ్ అయినట్లు అధికారికంగా ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: