
కార్తీ మాట్లాడుతూ జ్యోతిక ను నేను ఎప్పుడూ నటి గా చూడలేదని కామెంట్లు చేశారు. నేను ఆమెను అమ్మ గా మాత్రమే చూశానని పేర్కొన్నారు. జ్యోతిక కూడా మమ్మల్ని పిల్లల్లా చూసిందని సూర్య చెప్పుకొచ్చారు. అమ్మ ప్రస్తుతం ముంబై లో ఉండటం తో మా ఇల్లు బోసిపోయిందని కార్తీ కామెంట్లు చేశారు. అమ్మ తో కలిసి ఉన్నప్పుడు సంతోషం గా ఉన్నామని కార్తీ తెలిపారు.ఇన్ని సంవత్సరాల పాటు తామందరం కలిసి ఉన్నామంటే కారణం జ్యోతిక నే అని కార్తీ కామెంట్లు చేశారు. అన్నయ్య పిల్లలు పెద్దవాళ్లు అవుతుండటం తో చదువల కోసం వాళ్లు ముంబై కి వెళ్లారని చదువులు పూర్తైన తర్వాత తప్ప కుండా కలిసే ఉంటామని ఈలోపు ప్రతి పండుగ కు కలుస్తూ ఉంటామని కార్తీ చెప్పారు. కార్తీ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదిక గా తెగ వైరల్ అవుతున్నాయి.