టాలీవుడ్ లో ఈ జనరేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్స్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఒకటి. వెంకటేష్, మహేష్ బాబు, అంజలి, సమంత ఇంకా ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2013 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది.అప్పట్లో థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టగా, ఏళ్ళు గడిచే కొద్దీ మధ్యతరగతి యువత ఈ సినిమాకి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ కూడా పలు సన్నివేశాల్లో తమని తాము చూసుకుంటారు. ఇంకా ఈ సినిమాలోని సీన్స్ రీల్స్ రూపంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.అంతలా ప్రేక్షకుల హృదయాల్లో గట్టి స్థానం సంపాదించుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కి సీక్వెల్ తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఏకంగా పదేళ్ల తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి సీక్వెల్ తీస్తే బాగుంటుందనే ఆలోచన దిల్ రాజుకి వచ్చిందట.ఇప్పటికి ఆ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని సమాచారం తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఈ సీక్వెల్ పట్టాలెక్కితే మాత్రం, సీతమ్మ వాకిట్లో అభిమానులకు ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.


అయితే ఈ సీక్వెల్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు అందుబాటులో ఉంటాడా లేదా అనేదే అసలు ప్రశ్న. తనకు సీతమ్మ వాకిట్లో లాంటి క్లాసిక్ ఫిల్మ్ ని ఇచ్చిన అదే శ్రీకాంత్ అడ్డాల, ఆ తర్వాత 'బ్రహ్మోత్సవం' లాంటి పెద్ద డిజాస్టర్ ని కూడా ఇచ్చాడు.అయితే మహేష్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. ఎస్వీఎస్సీ కాంబో క్రేజ్ ని, అడ్డాల టాలెంట్ ని నమ్మి ఛాన్స్ ఇచ్చే అవకాశముంది.ఇంకా అలాగే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' చేస్తున్న మహేష్, ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా కూడా చేయనున్నాడు. ఇక రాజమౌళి సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కువ సమయం పడుతుంది.కాబట్టి ఈ గ్యాప్ లో 'ఎస్వీఎస్సీ-2' సినిమాని పూర్తి చేసే అవకాశాలున్నాయి. అలాగే మరోవైపు త్వరలో 'పెదకాపు-1' సినిమాతో పలకరించనున్న శ్రీకాంత్, ఆ తర్వాత 'పెదకాపు-2' ని పూర్తి చేసే ఛాన్స్ ఉంది. ఇక వెంకటేష్ ఈ ఏడాది చివరిలో 'సైంధవ్' మూవీతో పలకరించనున్నాడు.మరి దిల్ రాజు ఆలోచన ఫలించి, ఈ ముగ్గురూ 'ఎస్వీఎస్సీ-2' సినిమా కోసం రంగంలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: