పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ అమ్మడు హీరోయిన్ గా చేస్తున్న సినిమా ల జాబితా చాలా పెద్దగా ఉంది.మొదటి సినిమా డిజాస్టర్ అయినా కూడా అందంగా ఉంది.. మంచి యాక్టివ్‌ గా ఉంది అంటూ కొందరు ఫిల్మ్ మేకర్స్ ఈమెకి ఆఫర్లు ఇస్తున్నారు. పైగా ధమాకా సినిమా తో మంచి విజయాన్ని ఈమె దక్కించుకోవడం తో ఏకంగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా లో మెయిన్‌ హీరోయిన్‌ గా ఛాన్స్ దక్కించుకుంది.ఒక వైపు బాలయ్య కి కూతురు గా భగవంత్ కేసరి సినిమా లో నటిస్తూ మరో వైపు భారీ సినిమా లు చేస్తోంది. ఈమె నటించిన సినిమా ల్లో స్కంద సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన స్కంద సినిమా డిజాస్టర్ అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా శ్రీ లీల కి గతం లో మాదిరిగా ఆఫర్లు రావడం అనేది అసాధ్యం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. స్కంద సినిమా తర్వాత శ్రీ లీల వచ్చే నెలలో బాలయ్య మూవీ భగవంత్ కేసరి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా శ్రీ లీల కెరీర్ ఉంటుంది.

ఎందుకంటే ఆ సినిమా లో హీరోయిన్‌ గా శ్రీ లీల నటించలేదు. భగవంత్ కేసరి సినిమా తర్వాత మెగా హీరో తో నటిస్తున్న ఆదికేశవ సినిమా తో శ్రీ లీల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గుంటూరు కారం సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇన్ని సినిమా లు శ్రీ లీల నుండి వస్తున్నా కూడా కేవలం గుంటూరు కారం సినిమా విషయం లోనే అందరి దృష్టి కేంద్రీకృతం అయి ఉంది.ఎందుకంటే ఆ సినిమా హిట్ అయితేనే శ్రీలీల కెరీర్‌ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగుతుంది. స్కంద సినిమా నిరాశ పర్చడం తో బ్యాడ్‌ టైమ్ స్టార్ట్ అయిందని కొందరు అంటున్నారు. అయితే గుంటూరు కారం సినిమా తోనే ఆమెకు మంచి టైమ్‌ మళ్లీ మొదలు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: