చంద్రముఖి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పి వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. అయితే ఇప్పుడు దాదాపు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇక ఈ సినిమాకు సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అని చెప్పాలి. రాఘవ లారెన్స్ హీరోగా పి వాసు దర్శకత్వంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ హీరోయిన్ గా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే ఇలా చంద్రముఖి సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది తెలుస్తుంది. కానీ ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదు అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


 ముఖ్యంగా చంద్రముఖి పాత్రలో నటించినా కంగనాను గతంలో జ్యోతిక లెవెల్లో ఆకట్టుకోలేకపోయింది అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు భారీగానే బడ్జెట్ కేటాయించారు అన్న విషయం తెలుస్తుంది. ఇక హీరోగా నటించిన రాఘవ లారెన్స్ ఎంత పారితోషకం తీసుకున్నారు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది   అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం చంద్రముఖి 2 సినిమా కోసం లారెన్స్ ఏకంగా 30 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు టాక్.


 ఇక రాఘవ లారెన్స్ ఇంత భారీ పారితోషకం తీసుకోవడం కారణంగానే సినిమాకి కూడా భారీ బడ్జెట్ అయిందని సమాచారం. అయితే సినిమా విషయానికొస్తే చంద్రముఖి మొదటి పార్ట్ లాగానే సెకండ్ పార్ట్ కూడా ఉందట. అన్ని విషయాల్లో కూడా ఇక స్క్రీన్ ప్లే ఫైట్ ఇంట్రడక్షన్ అన్ని విషయాల్లో కూడా మొదటి పార్ట్ నే ఫాలో అయ్యాడు దర్శకుడు పి వాసు. ఫ్లాష్ బ్యాక్ మార్చి నిడివి పెంచడం మాత్రమే చేశాడు అని కొంతమంది ప్రేక్షకులు సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: