టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరీ విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉంది. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు సైతం చేస్తున్నారు మేకర్స్. ఒకవైపు రాజకీయ పనులు చేస్తూనే సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో టీం బాలయ్య ఆ పనులను చేస్తూ బిజీగా ఉన్నారు. సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేస్తూ నిర్మాతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు బాలయ్య కి మరో చిక్కు ఎదురైందని అంటున్నారు. నిజానికి స్కిల్

 డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు త్వరగా బయటికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక సిఐడి చేస్తున్న వాదనలు న్యాయస్థానాలకు వరుస సెలవులు వల్ల ఈ ప్రక్రియ ఇంతకి ఇంతకు ఆలస్యం అవుతూనే వస్తుంది. ఈ కారణంగా ఇప్పుడు బాలయ్య సైతం ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. అటు రాజకీయ కార్యక్రమాలు ఇటు సినిమా పనులు ఒకేసారి చూసుకోవడం వల్ల బాలయ్య ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. దానికి తోడు టిడిపిలో సంకట స్థితి కారణంగా బాలయ్య భగవంత్ కేసరి ప్రచారానికి రావడం కూడా కష్టమని అంటున్నారు. 

వచ్చినా కూడా ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా పొలిటికల్ హీట్ కు దారిస్తాయని అంటున్నారు. దీనివల్ల టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరీ  సినిమా ప్రమోషన్స్ సజావుగా సాగే పరిస్థితులు లేవన్న సమాచారం వినబడుతోంది . ఈ క్రమంలోనే ఈ సినిమాని కొన్ని రోజులు వాయిదా వేద్దాము అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అక్టోబర్ మూడు తర్వాత న్యాయస్థానాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంగతి అయిపోయిన తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా లేదా సినిమానే వాయిదా పడుతుందా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. చూద్దాం చివరికి ఏం జరుగుతుందో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: