నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ నటి చేతిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడు సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డిక్వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యానిమల్ మూవీ లో కూడా ఈ క్రేజీ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది.

తమిళ నటుడు ధనుష్ హీరోగా టాలీవుడ్ క్రేజీ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మూవీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా ఎంపిక అయింది.

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఓ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లో రష్మిక ను హీరోయిన్ గా కన్ఫామ్ చేసుకున్నారు .

ఇకపోతే రెయిన్బో అనే సినిమా లో ఈ ముద్దు గుమ్మ లీడ్ రోల్ లో నటించబోతుంది.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో రూపొంద బోయే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా లో ఈ నటి ప్రధాన పాత్రలో నటించబోతుంది.

మూవీ లతో పాటు విజయ్ దేవర కొండ హీరో గా గౌతఅమ్ తిన్ననూరి దర్శకత్వం లో రూపొంద బోయే మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిన ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: