ఇక గత వారం విడుదలైన భారీ చిత్రాల్లో `స్కంద`సినిమా కూడా ఒకటి. టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద డివైడ్ టాక్ తెచ్చుకుంది.సెప్టెంబర్ 28 వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం  తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది.ఇక ఆ తర్వాత శుక్రవారం, శనివారం వర్కింగ్ డేస్ కావడంతో స్కంద కలెక్షన్స్ కాస్త డల్ అయ్యాయి.సోమవారం గాంధీ జయంతి పబ్లిక్ హాలిడే కావడంతో.. ఆరోజు బాగానే వసూళ్లు రాబట్టింది. ఇక స్కంద మూవీకి ప్రపంచవ్యాప్తంగా 46.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అవ్వాల్సిన టార్గెట్ రూ. 47 కోట్లు. ఇక ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సమయానికి రామ్.. టార్గెట్ లో దాదాపు సగం దాకా రికవరీ చేసేశాడు.


తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇప్పటిదాకా రన్ పూర్తి అయ్యే సమయానికి మొత్తం రూ. 20 కోట్ల షేర్‌, రూ. 33 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్న స్కంద.. వరల్డ్ వైడ్ గా రూ. 25 కోట్ల షేర్‌, రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు కాకుండా ఇంకా రూ. 23 కోట్ల షేర్ వసూళ్లు వస్తే స్కంద మూవీ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవుతుంది. మరి హీరో రామ్ఇంత పెద్ద భారీ టార్గెట్ ను వర్కింగ్ డేస్ లో ఎంత వరకు అందుకుంటాడో చూడాలి.అయితే దాదాపు అది కష్టమే అని తెలుస్తుంది. ఎందుకంటే సినిమా అంతా లాజిక్ లేకుండా చాలా అతిగా ఉంది. సరైనోడు తరువాత బోయపాటి గ్రాఫ్ చూసుకుంటే అఖండ తప్ప ఏది హిట్ లేదు. ఓన్లీ బాలయ్యకే హిట్లు ఇస్తున్న బోయపాటి మిగతా హీరోలకి మాత్రం రాడ్డులు దింపుతున్నాడు. రొటీన్ రొట్ట కథలతో జనాలని విసుగెత్తిస్తున్నాడు. ఏదో రామ్ కి వున్న క్రేజ్ అతని పెర్ఫార్మన్స్ వల్ల ఈ సినిమా చూస్తున్నారు కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ కూడా ఏమి లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: