రామ్ పోతినేని హీరోగా రూపొందిన స్కంద మూవీ ఏప్రిల్ 28 వ తేదీన భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ విడుదల అయిన 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 9.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ... సీడెడ్ ఏరియాలో 3.68 కోట్లు , యూఏ లో 3.17 కోట్లు , ఈస్ట్ లో 1.90 కోట్లు , వేస్ట్ లో 1.24 కోట్లు , గుంటూరు లో 2.40 కోట్లు , కృష్ణ లో 1.32 కోట్లు , నెల్లూరు లో 1.06 కోట్లు మొత్తంగా ఈ మూవీ 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24.67 కోట్ల షేర్ , 41 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.50 కోట్లు , ఓవర్ సీస్ లో 1.84 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 29.01 కోట్ల షేర్ ... 50.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ సినిమాలో శ్రీ లీల , రామ్ సరసన హీరోయిన్ గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సాయి మంజ్రేకర్ , శ్రీకాంత్ , ప్రిన్స్మూవీ లో ముఖ్య పాత్రల్లో నటించగా ... ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: