తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్న బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే చాలు మాస్ ప్రేక్షకులందరికీ కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే బాలయ్యను అభిమానులు ఎలా అయితే చూడాలని అనుకుంటారో బోయపాటి తన సినిమాలో అలాగే చూపిస్తూ ఉంటారు. అందుకే బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ ఉంటాయి అని చెప్పాలి.



 ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవ్వగా రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన అఖండ ఎంత అఖండ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు  అయితే ఇక సూపర్ హిట్ అయిన అఖండ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు.. ప్రస్తుతం బోయపాటి శ్రీను సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తుంది  అయితే ఈ సీక్వల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలపై ఇంకా క్లారిటీ లేదు.


 అయితే బోయపాటి శ్రీను ప్రస్తుతం అఖండ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడట. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరిలో ఇక ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన బయటికి వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే మొదటి పార్ట్ లో లాగా కాకుండా ఇక రెండవ పార్ట్ లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి అని అటు ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. బాలయ్యను బోయపాటి ప్రేక్షకుల ఊహకందని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడు అని వార్తలు తెరమీదకి వస్తున్నాయ్. ఇక ఎప్పటి లాగానే బోయపాటి యాక్షన్ మార్క్ సీన్స్ పొలిటికల్ పంచులు కూడా గట్టిగానే ఉండబోతున్నాయట. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో భగవంత్ కేసరి అనే సినిమా తెరకెక్కి విడుదలకు రెడీ అయింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: