అన్ని విషయాలను కూడా ఎంతో సీక్రెట్ గా ఉంచేవారు సినీ సెలెబ్రెటీలు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో సినీ సెలెబ్రెటీలకు ప్రేక్షకులకు మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఎంతో మంది సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నేరుగా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పాలి. దీంతో పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అన్ని విషయాలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడానికి అందరూ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరో హీరోయిన్లు ఇక పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి.. కూడా అభిమానులకు చెబుతూ ఉండటం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం.
అయితే ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు తాను ఎదుర్కొన్న మానసిక సమస్య గురించి ఇటీవల సోషల్ మీడియాలో తెలిపింది. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయ్. తాను డిప్రెషన్ తో బాధపడుతున్నానని అంగీకరించడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది అంటూ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తెలిపింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లోనే నాకు మానసిక సమస్యలు ఉన్నాయని తెలిసినప్పటికీ.. పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్నాళ్లకే పరిస్థితి దిగజారిపోయింది. ఏకంగా అన్నం తినడం కూడా మానేశాను. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అండగా నిలిచారు కాబోయే భర్త నుపూర్ కూడా నన్ను అర్థం చేసుకున్నాడు అంటూ చెప్పుకొచ్చింది ఐరా ఖాన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి