ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా సంగీత దర్శకులలో అందరూ మాట్లాడుకుంటున్నది అనిరుధ్ రవిచందర్ గురించి. రెహమాన్ తరువాత అలాంటి ఖ్యాతిని పొందిన అదృష్టం అనిరుధ్ కు దక్కింది. ప్రస్తుతం ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇతడి మ్యానియా కొనసాగుతోంది. ‘జైలర్’ ‘జవాన్’ సినిమాల ఘన విజయంతో ఇతడు జాతీయ స్థాయిలో ట్రెండింగ్ గా మారిపోయాడు.



సినిమాకు 4 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగిన ఇతడు తమ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తే చాలు ఎన్ని కోట్లు అయినా కురూపించడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఏ ఆర్ రెహమాన్ కు వీరాభిమాని అయిన అనిరుధ్ తన స్కూల్ లో చదువుకునే రోజులలో ఒక సంగీత పోటీకి వెళ్ళి అక్కడ రెహమాన్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతి అందుకోవడం తన జీవితంలో మారిచిపోలేని సంఘటన అంటున్నాడు.



క్రికెటర్ ధోనీని హీరోయిన్ ఇలియానా ను విపరీతంగా ఆరాధించే అనిరుధ్ అనుకోకుండా సంగీత దర్శకత్వంలోకి ప్రవేశించాడు. తాను కాలేజీలో చదువుకునే రోజులలో ఒక అమ్మాయిని  తాను విపరీతంగా ప్రేమించినా ఆమె తనను కాకుండా వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుని వెళ్లిపోయాక విపరీతంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడంతో తన అన్న సలహాతో సంగీతం పై దృష్టి పెట్టి విజయం సాధించానని ఒకవిధంగా తన విజయాలకు తన బ్రేకప్ లవ్ స్టోరీ కారణం అంటున్నాడు. వాస్తవానికి పాటలు పాడటం తన వృత్తి కాదనీ అయితే వేరే సంగీత దర్శకుల సినిమాల తాను పాటలు పడుతున్నానని ఒక విధంగా పాటలు పాడటం వల్ల తన స్ట్రెస్ తీరుతొంది అంటున్నాడు.



తనకు కాబోయే భార్య తనకు బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటూ తన లోపాలాను అర్థం చేసుకోవాలని తనను ఒక సెలెబ్రెటీలా కాకుండా తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఇష్టపడే అమ్మాయి దొరికినప్పుడు తాను పెళ్ళి చేసుకుంటానని అయితే అలాంటి అమ్మాయి ఎప్పుడు ఎక్కడ దొరుకుటుందో ప్రస్తుతానికి తనకు క్లారిటీ లేదు అని అంటున్నాడు. పరీక్షల సమయంలో మినహా ఎప్పుడూ కాలీకి వెళ్లని అనిరుధ్ కు కాలేజీకి సంబంధిం మాత్రం చాల జ్ఞాపకాలు ఉన్నాయి అంటున్నాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: