ఈక్రమంలో అభిమానుల మీద మాత్రం సల్మాన్ ఖాన్ కాస్తఅలిగినట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ పై సల్మాన్ అసంతృప్తితో ఉన్నారట. దీనికి కారణం టైగర్ 3 థియేటర్ లో.. సినిమా చూస్తున్నప్పుడు అభిమానులు పటాకులు పేల్చారు. పటాకులు కాల్చడంతో థియేటర్‌లోని ప్రేక్షకులు లేచి బయటకు పరుగులు తీశారు.దీంతో థియేటర్ కూడా దెబ్బతింది. సల్లూ అభిమానుల ఈ దారుణమైన ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు అభిమానులు, నెటిజన్లు దీనిని తీవ్రంగా ఖండించారు.
నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ విషయంలో ఫ్యాన్స్ పై మండిపడ్డాడు. ఇది చాలా చెడ్డ పని...సినిమా నడుస్తున్ప్పుడు ఇలా పటాకులు కాల్చడం చాలా ప్రమాదకరమైన విషయం. ఎవరూ అలాంటి పని చేయకూడదు అని గట్టిగానే సలహా ఇచ్చాడు సల్మాన్. అంతే కాదు ఇక ముందు తన కటౌట్‌కు పాలభిషేకం చేయద్దన్నాడు సల్లూ భాయ్. మా పోస్టర్లు, కటౌట్లపై పాలు పోసి వాటిని అలా వృథా చేయడం చాలా పెద్ద తప్పు. దయచేసి ఆ పాలను చిన్నారలకు పంచండి.. అవి ఒకరి కడుపు నింపాలి కాని ఇలా వృదాగా పోవద్దు అన్నారు.
ఈవిధంగా సల్మాన్ ఖాన్ తన ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు. ఈ దీపావళి పండుగకు టైగర్ 3 సినిమా రిలీజ్ అయ్యింది. దివాళి రిలీజ్ అంటే సల్మాన్ ఖాను కు సెంటిమెంట్ అంటున్నారు సినీ జనాలు. ఈద్ నాడు కాని.. దివాళి నాడు కానితన సినిమాలు రిలీజ్ అయ్యేలా చూస్తాడట. ఇక ఈ సినిమాలో కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ కలిసి నటించారు. షారుక్ ఖాన్ కూడా ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ రా ఏజెంట్ పాత్రలో కనిపించాడు. 2012లో విడుదలైన 'ఏక్ థా టైగర్' సినిమా సిరీస్‌ను నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ కొనసాగిస్తోంది. ఇప్పుడు 'టైగర్ 3' కూడా మొదటి రెండు సినిమాల్లాగే సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో హృతిక్ రోషన్ కూడా ఓ క్యామియో రోల్‌లో కనిపించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి