ఘట్టమనేని ఫ్యామిలీ నుండి టాలీవుడ్ కి హీరో గా ఎంట్రీ ఇచ్చారు సుధీర్ బాబు. ఆ తర్వాత పలు రకాల సినిమాలు చేసి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ హీరో కొంతకాలంగా పరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. సమ్మోహనం తర్వాత సుధీర్ బాబుకి ఒక్క సక్సెస్ కూడా రాలేదు. రీసెంట్ గా వచ్చిన 'మామ మశ్చీంద్ర' కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పటి వరకు  ప్రయోగాత్మక పాత్రలు చేసినా ఏవీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నిజానికి సుధీర్ బాబు కటౌట్ కి తగ్గ మాస్ సినిమా ఇప్పటిదాకా పడలేదు. 

సుధీర్ బాబు బాడీ లాంగ్వేజ్ కి ఓ పర్ఫెక్ట్ మాస్ సినిమా పడితే బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. వాళ్ల కోరికని సుధీర్ బాబు తన లేటెస్ట్ మూవీతో తీర్చబోతున్నట్లు కనిపిస్తుంది. సుధీర్ బాబు హీరోగా 'హరోం హరా' అనే సినిమా తెరకెక్కుతోంది. కాసేపటి క్రితమే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూస్తుంటే ఈ సినిమాతో సుధీర్ బాబుకి మాస్ ఇమేజ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ లో చూపించిన హీరో ఎలివేషన్ షాట్స్, డైలాగ్స్, బీజీయం సినిమాపై 

మరింత ఆసక్తిని రేకెత్తించాయి. అలాగే ఇందులో సుధీర్ బాబు తన సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు.' అందరూ పవర్ కోసం గన్ పట్టుకుంటారు. కానీ ఇది ఏడేడో తిరిగి నన్ను పట్టుకుంది'.. 'ఈ కాలంలో అంతా మంచిగా ఉంటే ముంచేస్తారు. తెగిస్తేనే తెగ్గి నడుసుకుంటారు'.. 'వాడు సమరమే మొదలెడితే ఆ సంభవానికి సంతకం నాదైతది'.. వంటి డైలాగ్స్ చూస్తుంటే గోదావరి జిల్లాల స్లాంగ్ కనిపిస్తోంది. డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. సుధీర్ బాబు కటౌట్ కు తగ్గ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండబోతుందని టీజర్ చూస్తే స్పష్టం అవుతుంది. టీజర్ తోనే అంచనాలు పెంచేస్తున్న ఈ మూవీ సుధీర్ బాబు కి మంచి కం బ్యాక్ ఇస్తుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: