టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే నాగ చైతన్య ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన అమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా రూపొందిన లాల్ సింగ్ చడ్డ అనే హిందీ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేదు. అయినప్పటికీ ఈ మూవీ లో చైతన్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో హిందీ సినీ పరిశ్రమలో చైతన్య కి ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే చైతన్య తాజాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన దూత అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది నాగ చైతన్య కెరియర్ లో మొట్ట మొదటి వెబ్ సిరీస్. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ఈ రోజు నుండి అనగా డిసెంబర్ 1 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక నాగ చైతన్య మొట్ట మొదటి సారి నటించిన వెబ్ సిరీస్ కావడంతో దీనిపై ప్రేక్షకులు మొదటి నుండే మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ ను అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నాగ చైతన్య ... విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో మనం ... థాంక్యూ మూవీ లు రూపొందాయి. ఇందులో మనం మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: