తాజాగా నాచురల్ స్టార్ నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నాని కి జోడిగా నటించగా ... కొత్త దర్శకుడు శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఖుషి మూవీ కి సంగీతం అందించి తెలుగు సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వషిం అబ్దుల్ వాహెబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం నాని వరుస ఇంటర్వ్యూ లలో ... టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా నాని తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 కు నిన్న గెస్ట్ గా కూడా వచ్చాడు. ఈ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. ఇకపోతే ఈ రోజు అనగా డిసెంబర్ 4 వ తేదీన ఈ మూవీ బృందం ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రాంతాలను పర్యటించబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. మరి ఆ ప్రాంతాలు ఏవో తెలుసుకుందాం.

హాయ్ నాన్న మూవీ యూనిట్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు లోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ని పర్యటించనున్నట్లు ... ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు మంగళగిరి లోని కే ఎల్ డిమేడ్ టు బి యూనివర్సిటీ సందర్శించనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అందిరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: