కే జి ఎఫ్ చాప్టర్ 1 మరియు చాప్టర్ 2 మూవీ లతో ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న హీరో యాష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదల అయిన తర్వాత నర్తన్ దర్శకత్వంలో తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ఆ మూవీ సెట్ కాలేదు. ఆ తర్వాత మరి కొంత మంది దర్శకుల పేర్లు కూడా తెర పైకి వచ్చాయి. కానీ అందులో ఏ మూవీ కూడా సెట్ కాలేదు.

కే జి ఎఫ్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ హీరో తన నెక్స్ట్ మూవీ తో కూడా అదే స్థాయి విజయాన్ని అందుకోవాలి అనే నేపథ్యంలో అనేక కథలను విన్నట్లు అందుకే ఈయన తదుపరి మూవీ ని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ఎట్టకేలకు ఈయన తన తదుపరి మూవీ ని ఓకే చేశాడు. డిసెంబర్ 8 వ తేదీన ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ఈయన నెక్స్ట్ మూవీ కి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ఉండనున్నట్లు మూవీ బృందం ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా యాష్ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఓ అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... యాష్ హీరోగా రూపొందబోయే నెక్స్ట్ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ ... మోస్ట్ టాలెంటెడ్ నటిమని సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్నట్లు ... ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాలో హీరోయిన్ గా ఈ నటిని సంప్రదించగా ఈ మూవీ కథ మొత్తం విన్న ఈ నటి ఈ సినిమాలో యాష్ కి జోడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ మూవీ బృందం మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: