
డిసెంబర్ 8వ తేదీన ఈ మూవీ థియేటర్లలో సందడి చేయబోతుంది. హరీష్ జయరాజ్ ఈ మూవీకి సంగీతం అందించడం గమమార్హం. ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అయితే గత కొంతకాలం నుంచి హిట్ అనే పదానికి దూరమైన నితిన్ ఈ మూవీపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కాగా ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో నితిన్ బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్.. మీ లైఫ్ లో ఎక్స్ ట్రా ఆర్డినరీ మూమెంట్ ఏంటి అని అడిగితే ఆసక్తికరమైన విషయం చెప్పారు. అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. తనకు వరుసగా 8 లాప్స్ వచ్చిన తర్వాత ఇష్క్ సినిమాతో బ్యాక్ బౌన్స్ అయ్యానని అది ఎక్స్ ట్రా ఆర్డినరీ మూమెంట్.
అయితే ఇప్పుడు వరకు తాను చేసిన సినిమాలను మళ్లీ తానే చేయాల్సి వస్తే ఒక ఫ్లాప్ సినిమాను చేస్తాను అని చెప్పాడు. అదే శ్రీ ఆంజనేయం మూవీ. నా సినిమాలలో నాకు చాలా ఇష్టమైన మూవీ అది. కేవలం రెండు మూడు మిస్టేక్స్ వల్లే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఒకవేళ లేటెస్ట్ టెక్నాలజీ తో ఆ మూవీ ని ఇప్పుడు రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని నమ్మకం నాకుంది. అలాంటి ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేయాలనేది నా కోరిక అంటూ నితిన్ చెప్పుకొచ్చాడు.