టాలీవుడ్ సీనియర్ నటి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అగ్ర హీరోల సినిమాల్లో అక్క, అమ్మ, వదిన పాత్రలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కూతురుతో పొట్టి పొట్టి బట్టలు వేసుకుని రీల్స్ చేస్తూ కనిపించడం, డబ్బున్నోడు దొరికితే రెండో పెళ్లి చేసుకుంటానని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే.  అలా ఈ తల్లీ కూతుళ్లు నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పెడుతూ ఒక్కోసారి ట్రోలింగ్ కి గురవుతుంటారు. ఇదిలా ఉంటే ఎలక్షన్ టైమ్ లో BRS పార్టీని గెలిపించడానికి చాలామంది సెలబ్రిటీస్ రీల్స్ చేసి వాటిని తమ సోషల్ మీడియాలలో షేర్ చేసిన విషయం తెలిసిందే కదా. 

అందులో సురేఖ వాణితో పాటూ కూతురు సుప్రీత కూడా ఉన్నారు. ముఖ్యంగా సుప్రీత కారు ముందు నిలబడి BRS ను గెలిపించమని కోరుతూ వీడియో చేసింది. ఇక తాజాగా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆ వీడియోని డిలీట్ చేసి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ ఫోటోని చూసిన నెటిజన్స్ ఈ తల్లి కూతుళ్ళపై రకరకాల కామెంట్స్ తో సోషల్ మీడియా అంతటా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే బూతులతో దాడి చేస్తున్నారు. తాజాగా దీనిపై సుప్రీత రియాక్ట్ అవుతూ..

" రాజకీయ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను మొదట BRS కు సపోర్ట్ చేశాను. అందులో తప్పేముంది. అదేవిధంగా గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పాను. ఈ మాత్రానికి నన్ను ట్రోల్ చేయడమేంటి? నేను మీకేం అన్యాయం చేశాను. నాపై ఎందుకింత ద్వేషం పెంచుకున్నారు. మీరు చేస్తున్న ట్రోలింగ్ వల్ల నా మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి" అంటూ సుప్రీత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: