సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు ఉన్న హీరోలకి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. హీరోలు మంచి సక్సెస్ లు సాధించడానికి వరుసగా మంచి సినిమాలను చేస్తూ ఉంటారు. మరి కొంతమంది హీరోలు మాత్రం సక్సెస్ అయ్యే సినిమాలను సరిగ్గా క్యాలిక్యులేట్ చేయలేక వదిలేసుకుంటారు.దాని ఫలితంగా ఆ సినిమాలు వేరే హీరోలు చేసి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉంటారు.ఇక ఇలాంటి సినిమాలను కోల్పోయిన హీరోలు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ఒక సినిమాని జడ్జ్ చేయలేని తెలివి తక్కువ తనం వల్ల చాలామంది హీరోలు చాలా సక్సెస్ లను కోల్పోయారు. ఇలాంటి క్రమంలోనే నితిన్ కూడా చాలా హిట్ సినిమాలని మిస్ చేసుకున్నాడు నిజానికి అతనొక్కడే లాంటి సినిమాని సురేందర్ రెడ్డి  మొదట్లో నితిన్ తో చేయాలని అనుకున్నాడు. కానీ ఆ కథని నితిన్ రిజెక్ట్ చేశాడు. దాంతో ఆయన కళ్యాణ్ రామ్ తో సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక సురేందర్ రెడ్డి , వి వి వినాయక్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కావడంతో వివి వినాయక్ తో దిల్ సినిమా చేసిన నితిన్ ని అతనొక్కడే స్టోరీ చెప్పడం కోసం వినాయక్ ని ఒప్పించి వినాయక్ తో మాట్లాడించి సురేందర్ రెడ్డి నితిన్ ని కలిశాడు.   అయితే కథ మొత్తం విన్న తర్వాత నితిన్ ఈ సినిమా తనకి సెట్ అవ్వదు అని చెప్పి సింపుల్ గా ఆ కథని రిజెక్ట్ చేశాడు. దాంతో సురేందర్ రెడ్డి కి ఏం చేయాలో అర్థం కాక బయటికి వచ్చేసి మరొకసారి మరొక ప్రయత్నంగా కళ్యాణ్ రామ్ ని కలిసి కథ వినిపించి ఆయనతో సినిమా తీశాడు.ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా అటు డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి కి, ఇటు హీరోగా కళ్యాణ్ రామ్ కి మంచి క్రేజ్ ని తీసుకు వచ్చిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: