బాలీవుడ్ స్టార్ హీరో, విలన్గా నటించిన మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సైఫ్ అలీఖాన్ కూడా ఒకరు.. ఇటీవల సైఫ్ అలీ ఖాన్ కు మోకాలుకి భుజాలకి గాయమైనట్లుగా సమాచారం.. దీంతో ఆయన సర్జరీ కోసం సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ కి వెళ్లినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఈయనకు గాయాలైనట్టుగా సమాచారం. ఈ సినిమాలో భారీ యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.


ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ మధ్య అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఇవి ఈ సినిమాకి హైలైట్ గా ఉండనున్నాయట. సైఫ్ అలీ ఖాన్ టీమ్ మాత్రం తన గాయాల గురించి ఎటువంటి సమాచారాన్ని తెలుపలేదు. కేవలం బాలీవుడ్ మీడియాలోనే వినిపిస్తున్నాయి. ఈ వార్త తెలుసుకున్న సైఫ్ అలీఖాన్ అభిమానులు సైతం తాను త్వరగా కోలుకోవాలని తెలియజేస్తున్నారు. గతంలో కూడా సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ నటించిన అది పురుష్ సినిమాలో రావణాసురుడిగా నటించారు.


ఇప్పుడు దేవర తో మరొకసారి తెలుగులోకి అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తూ ఉండగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తూ ఉన్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. దాదాపుగా రూ .300 కోట్ల భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తలకెక్కిస్తూ ఉండడం గమనార్హం. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్ర బృందం.. అయితే ఈ సినిమా సమయానికి ఎలక్షన్స్ వస్తున్నాయని దీంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.మరి ఇంతవరకు చిత్ర బృందం ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: