ప్రభాస్‌ సినిమాల లైనప్‌ పెద్ద షాకిస్తుంది. ఆయన చేతిలో ఐదారు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. పార్ట్ 2లు ఉన్నాయి. కొందరు దర్శకులు వెయిటింగ్‌లో ఉన్నారు. ఏ సినిమా ఎప్పుడు ఫినిష్‌ అవుతుంది, ఎప్పుడు ప్రారంభమవుతుందో అర్థం కావడం లేదు.ఈ నేపథ్యంలో ఓ మైండ్‌ బ్లాక్‌ అయ్యే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్‌ మరో సినిమాకి సైన్‌ చేశాడట. మాస్‌ డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడట. ఆయన ఎవరో కాదు మాస్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబోకి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్‌తో ఓ భారీ మూవీని ప్లాన్‌ చేస్తున్నారట బోయపాటి. యాక్షన్‌ సినిమాలు చేయడంలో బోయపాటి దిట్ట, ఆయన యాక్షన్‌ నెక్ట్స్ లెవల్‌ ఉంటుంది. ఆయనకు ప్రభాస్‌ లాంటి కటౌట్‌ దొరికితే వెండితెరని ఆడుకుంటాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అదే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్‌.. కల్కి2898ఏడీ`లో బిజీగా ఉన్నారు. మేలో ఈ మూవీ రానుంది. మారుతితో `రాజాసాబ్‌ మూవీ ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇది వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్‌ చేయాల్సి ఉంది. ఇది ఈ ఏడాది చివర్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు హను రాఘవపూడి వెయిటింగ్‌లో ఉన్నారు. ఈయన మూవీ వచ్చే ఏడాది ప్రారంభవుతుందని అంచనాల వేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రశాంత్‌ నీల్‌తోనే సలార్‌2 చేయాల్సి ఉంది. ఈ మూవీకి కొంత టైమ్‌ పడుతుందేమో. ఇవన్నీ కంప్లీట్‌ అయ్యాక బోయపాటి మూవీ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉందని, అయితే ఫైనల్‌ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రభాస్‌ బోయపాటి కాంబో లోడింగ్‌ అనేది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ప్రస్తుతం బోయపాటి శ్రీను.. గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండతో ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. అలాగే బాలకృష్ణతో అఖండ2 చేయనున్నారు. అలాగే అల్లు అర్జున్‌తోనూ ఓ కమిట్‌ మెంట్‌ ఉందని తెలుస్తుంది. మరి ఇవన్నీ అయిపోయాక ప్రభాస్‌ మూవీ ఉంటుందా? అనేది చూడాలి. కానీ ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుందని చెప్పొచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: