సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఆ ప్రపంచం అందరికీ ఒకేలా ఉండదు. ఎవరికి నచ్చిన రంగులో వారు చూస్తూ ఉంటారు. పైగా ఒకరికి వచ్చిన అవకాశం మరొకరికి వస్తే అది ఇంకొక రకంగా కనిపిస్తుంది.చాలా సార్లు ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన పాత్రను మరొకరు చేస్తూ ఉంటారు. ఒకరికి దక్కాల్సిన క్రెడిట్ మరొకరికి దక్కుతూ ఉంటుంది. ఇలాంటి ఒక సంఘటన రావు గోపాలరావు మరియు కోట శ్రీనివాస రావు మధ్య కూడా జరిగింది. కోట శ్రీనివాసరావుఈ రోజు వరకు గుర్తుండి పోయే పాత్రలు చేస్తూ వస్తున్నారు అంటే అది ఆయన కెరియర్ తొలినాల్లలో చేసిన ఒక సినిమా వల్లే జరిగింది.అదేంటంటే కామెడీ బ్రహ్మా జంధ్యాల తీసిన ఆహనా పెళ్ళంట సినిమామీకు గుర్తుంది కదా. ఆ సినిమాలో లక్ష్మీపతి అనే పాత్ర కూడా శ్రీనివాసరావు చేశాడు.ఇక ఈ పాత్ర కోసమే పుట్టాడా ఏంటి కోట అనేంత విధంగా ఆ పాత్ర ద్వారా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు కి బదులుగా మరొక నటుడితో చేయించాలని అనుకున్నారట. కానీ అనుకోకుండా ఇది కోటను వరించి ఆయనను కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసింది.

ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో కామెడీతో తన సినిమాలను రక్తి కట్టించాడు. అయితే మరి ఈ పాత్ర మొదట అనుకున్నా నటుడు మరెవరో కాదు రావు గోపాల్ రావు. ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న రామానాయుడుఈ కామెడీ పాత్ర రావు గోపాల్ రావు తో చేయించాలంటే అప్పటికే మండలాధీశుడు వంటి సినిమా చేసిన కోట శ్రీనివాసరావును చూసి జంధ్యాలకోట చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట.  అయితే ఓ రోజు చెన్నై ఎయిర్పోర్టులో రామానాయుడు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న సందర్భంగా అక్కడే కూర్చున్న కోట శ్రీనివాసరావుని గమనించారట. దాంతో కోటా రామానాయుడు దగ్గరికి వెళ్లి పలకరించారట. అప్పుడే తను జంధ్యాలతో చేయబోయే సినిమాను అందులో రాసుకున్న పాత్ర గురించి చెప్పారట.నేను రావు గోపాల్ రావుతో చేద్దామంటే జంధ్యాల నీతో చేద్దాం అంటున్నాడు. సరే నువ్వే చేద్దువు కానీ 20 రోజులు డేట్స్ ఇవ్వు అని చెప్పారంట. దాంతో ఆయన ఆ సినిమాకి డేట్స్ ఇవ్వడం, ఆ సినిమా పాత్ర అద్భుతంగా పండటం, కోట కామెడీ తో సినిమా విజయవంతం అవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: