ఇక ఇప్పటి వరకు కమెడియన్‌గా రాణించిన అభినవ్ ఒక సినిమా మొత్తాన్ని లీడ్ చేసే హీరో బాధ్యతను తన వంతు వరకు పూర్తి స్థాయిలో మెప్పించాడు. మనోహర్ క్యారెక్టర్‌లో అభినవ్ ఒదిగిపోయాడు. కమెడియన్‌గా మాత్రమే కాదు.. సీరియస్ పాత్రల్లోనూ అభినవ్ తన టాలెంట్ చూపించాడు. ఇక రాహుల్‌గా అలి రెజా కూడా ఆకట్టుకునేలా నటించారు. ఇక ఉమాదేవిగా వైశాలి రాజ్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో స్నేహితుడు శివగా మొయిన్, రవి పాత్రకు తమిళ నటుడు నిజల్గళ్ న్యాయం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. టెక్నికల్‌గా కూడా సినిమా ఆకట్టుకునేలా ఉంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట బాగా ప్లస్. సినిమాటోగ్రఫీ కూడా చూడడానికి రిచ్‌గా ఉంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు బాగున్నాయి.ఫైనల్ గా అభినవ్ గోమఠం హీరోగా చేసిన 'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా' అంచనాలు లేకుండా చూసే వారికి నచ్చొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి