ప్రముఖ తమిళ నటి వెన్నిర ఆడై నిర్మల షాకింగ్ కామెంట్స్ చేసింది. తనపై టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేసింది.ఆమె గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్‌ హీరోపై నటుడిపై షాకింగ్ కామెంట్స్‌ చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. గత ఇంటర్వ్యూలో నిర్మల మాట్లాడుతూ.. 'నేను తెలుగులో చాలా సినిమాల్లో నటించా. దాదాపు కొన్నేళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో నటించా. షూటింగ్ తర్వాత నేను నా రూమ్‌లో నిద్రపోతున్నా. రాత్రి సమయంలో వచ్చి హీరో తలుపు కొట్టాడు. మీరు తలుపు తీయండి. నేనేం చేయను. మీ దగ్గరికి వచ్చి వెళ్లిపోతా అన్నాడు. ఫుల్‌గా మందు తాగి వచ్చి అలా మాట్లాడారు. ఈ ఘటనతో తాను షాక్ అయ్యా. ఆ తర్వాత నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నా. దర్శకనిర్మాతలు నన్ను కన్విన్స్‌ చేసినప్పటికీ ఒప్పుకోలేదు. ఇలాంటివాటిని నేనస్సలు సహించను' అంటూ వెల్లడించింది. అయితే ఆ నటుడి పేరు చెప్పడానికి కూడా తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన తెలుగు నటుడి నుంచి ఇలాంటి ప్రవర్తన తాను ఊహించలేదని అలనాటి నటి చెప్పింది.

కాగా.. తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ వెన్నిరాడై నిర్మల తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో నటించారు. వందలాది చిత్రాలు చేసిన ఆమె తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వెన్నెలాడె చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమె హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నాలుగు వందలకు పైగా చిత్రాలు చేసింది. తెలుగులో మా ఇంటి వెలుగు, దత్తపుత్రుడు, పిచ్చిపిల్ల, బొమ్మ బొరుసు, మదర్‌ ఇండియా, భక్త ప్రహ్లాద, కరుణామయుడు, శ్రీ సీతారాముల కల్యాణం చూద్దము రారండి, కలిసుందాం రా, జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా వంటి అనేక తెలుగు చిత్రాలు చేసింది. అంతేకాదు.. ఆమె తెలుగులో స్టార్ హీరో బాలకృష్ణ సినిమాల్లో కూడా నటించింది.కాగా.. 2001లో ఒక తెలుగు సినిమా షూటింగ్‌లో స్టార్ నటుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఆ సినిమా ఫైట్ మాస్టర్ తనను అవమానించాడని బిగ్ బాస్ తమిళ 7 కంటెస్టెంట్, సీనియర్ నటి విచిత్ర కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: