డీజే టిల్లు.. ఈ పేరు వినిపించింది అంటే చాలు.. ఎందుకో యూత్లో తెలియని జోష్ వచ్చేస్తూ ఉంటుంది. అంతలా ఈ మూవీ అందరికీ కనెక్ట్ అయిపోయింది అన్న విషయం తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇక చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు ఇండస్ట్రీలో అడపాదడపా అవకాశాలు మాత్రమే అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ని యూత్ అందరికీ కూడా బాగా దగ్గర చేసింది ఈ మూవీ. ఇక ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ ఇలా ఒక్కటేమిటి ప్రతి ఒక్కటి కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఇక చాలా రోజుల తర్వాత ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులు అందరిని కూడా కడుపుబ్బా నవ్వుకునేలా చేసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా సెన్సేషనల్ విజయం సాధించడంతో ఈ మూవీకి సీక్వెల్  గా ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో సిద్దు జొన్నలగడ్డ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే బిజెపిలో   పాత్రలో సిద్దు జొన్నల గడ్డ తప్ప మరొకరు చేస్తే అసలు సెట్ అయ్యేవారు కాదు అని ప్రేక్షకులకు సినిమా విడుదలైనప్పుడే అనిపించింది. కానీ డీజే టిల్లు పాత్రని మహేష్ బాబు చేస్తే ఎలా ఉంటుంది. అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అనిపిస్తుంది కదా.


 అయితే ఇప్పుడు డిజె టిల్లు పాత్రలోకి మహేష్ బాబు పరకాయ ప్రవేశం చేశాడు. ఇక సిద్దు జొన్నలగడ్డ లాగానే యాటిట్యూడ్ చూపిస్తూ డైలాగులు చెప్పేస్తూ ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం ఏఐ ట్రెండ్ కొనసాగుతుంది. ఎవరు వాట్సాప్ డీపీ, స్టేటస్ చూసిన ఏఐ ఫొటోస్ కనిపిస్తున్నాయ్. అయితే ఇటీవల మహేష్ బాబుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. డీజే టిల్లు మూవీ లో  అపార్ట్మెంట్ సీన్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఈ సీన్ లో మహేష్ బాబు ఫేస్ ని ఎడిట్ చేసి ఒక వీడియోని తయారు చేశారు నేటిజన్స్. ఈ వీడియోని సోషల్ మీడియాలో వదలడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: