ఫిల్మ్ ఇండస్ట్రీలో... మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ కిడ్స్ కు కొదవ లేదు. కాని అందులో ఎంతమందికి ఇండస్ట్రీలో నిలబడేంత స్టఫ్ ఉంది అనేది ఇప్పుడు అసలు మ్యాటర్.అయితే ఇదివరకు ఏమో కాని.. ఇప్పుడు మాత్రం స్టార్ కిడ్స్ టాలెంట్ చిన్నతనంలోనే తేలిపోతోంది. మన హీరోలు పెరిగి పెద్దవారు అయ్యాక హీరోలుగా నిలబడటానికి నానా తిప్పలు పడ్డారు.. తమను తాము టాలెంటెడ్ గా నిరూపించుకుంటే.. కొంత మంది స్టార్ కిడ్స్ చిన్నతనంలోనే తమ సత్తా చాటుతున్నారు.సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటూ.. ఇండస్ట్రీలో ముందే కర్చీఫ్ వేసుకుంటున్నారు స్టార్ కిడ్స్. ఈ విషయంలో మహేష్ బాబు కూతురు సితార తో పాటు.. అల్లు అర్జున్ పిల్లలు ఇద్దరు ముందున్నారు. మరీ ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లుఅయాన్ కూతురు అర్హా కూడా ఇండస్ట్రీలో పాపులర్ అవుతున్నారు. ఇప్పటికే అర్హ ఓసినిమా చేసింది. సోషల్ మీడియాలో వీడియోలతో అదరగొడుతోంది. అటు అయాన్ కూడా సినిమాల్లోకి రాకుముందే మంచి పాపులారిటీని మూటగట్టేస్తున్నాడు. దాదాపు 10 ఏళ్ళ వయసు ఉన్న అయాన్.. తన అల్లరితో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాడు.

తను చేసే చిలిపి పనులకు అల్లు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతుంటారు. ఇక అయాన్ అల్లరికి అభిమానుల తెగ ఖుషీ అవుతుంటారు. తాజాగా అల్లు అయాన్ తన తండ్రిని ఇమిటేట్ చేసి సోషల్ మీడియాలో సందడి చేశాడు.ఒక భుజం పైకి లేపి గూనిగా అల్లు అర్జున్ పుష్పసినిమాలో నడుస్తాడు. ఈ మేనరిజాన్ని మక్కీ దింపేశాడు అయాన్. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ మాదిరి నడిచాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ని చాలా బాగా అనుకరించారు అల్లు అయాన్. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జూనియర్ పుష్ప అంటూ కితాబు ఇస్తున్నారు.ఇక ఇంతకు ముందు కూడా ఇలాంటి టాలెంట్స్ చాలా చూపించాడు అల్లు అయాన్. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలోని 'లుటు పుటు గయా' పాటని.. పాడుతుండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకు ముందు డాన్స్ లు అల్లరి వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింట్లో అందుబాటులో ఉన్నాయి.
పుష్ప సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సాధించారు. బెస్ట్ హీరోగా జాతీయ అవార్డ్ కూడా సాధించాడు బన్నీ. గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో బన్నీ మేనరిజం దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. పుష్ప2ను అంతకు మించి తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ టార్గెట్ గా.. 1000 కోట్లు కలెక్షన్ క్రాస్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: