టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నెక్స్ట్ గామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.ఇక విద్యాధర్ దర్శకత్వం వహించిన ఈ గామి సినిమా మొదట చిన్న సినిమాగా మొదలై ఆ తర్వాత ప్రమోషన్స్ కంటెంట్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ వారం గ్రాండ్ గా ఈ సినిమా థియేట్రికల్ గా రిలీజ్ కాబోతోంది.తప్పకుండా ఈ సినిమాలో కంటెంట్ ఇంకా హై విజువల్స్ ఎంతో ఆకట్టుకుంటాయి అని ట్రైలర్ ద్వారానే అర్థమయిపోయింది. ఇక ఈ సినిమాకు విశ్వక్ సేన్ కూడా బడ్జెట్ కారణాల దృష్ట్యా రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. గామి సినిమా ఎలా ఉండబోతుందనే విషయంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. ఈ మూవీలో హీరో అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు.మానవ స్పర్శ అనేది అతనికి ఊహించని విధంగా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది. ఒక మానసిక సమస్యతో బాధపడుతున్న అతను హిమాలయాలకు తన ప్రయాణాన్ని సాగిస్తాడు. అక్కడే అతని సమస్యకు అసలు సమాధానం దొరుకుతుందని అనుకుంటాడు. దీంతో అతని ప్రయాణమే గామి సినిమాలో అసలు పాయింట్ అని రిలీజ్ అయిన ట్రైలర్ తో అర్ధమైపోయింది.


ఇక ఈ సినిమాకు తప్పకుండా సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా A సర్టిఫికెట్ రావడం షాకింగ్ విషయం. ట్రైలర్ లో అయితే మరి ఆ రేంజ్ లో A సీన్స్ అయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు సెన్సార్ నుంచి ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే అనే క్లారిటీ రావడం అయితే మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.అంతలా ఈ సినిమాలో పెద్దలు చూసే కంటెంట్ ఏముందా అనే ఆలోచన మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది. సినిమాలో ఒక తెలియని భావోద్వేగం అలాగే ఆలోచింపజేసే సన్నివేశాలు ఉన్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఆ విషయాలను ఎంత లోతుగా చెప్పారో వెండితెరపైనే ఖచ్చితంగా చూడాలి. ఇక ఏ సర్టిఫికెట్ రావడంతో మార్చి 8న విడుదల కాబోతున్న గామి సినిమాపై మరింత అంచనాల పెరిగాయి. ఈ సినిమాని బేబీ, హనుమాన్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.మార్చి 8 వ తేదీన ఈ సినిమాతో పాటు భీమా, ప్రేమలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: