2009లో వచ్చిన వైశాలి అనే సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు హీరో ఆది పినిశెట్టి.. ఈ సినిమా నాచురల్ థ్రిల్లర్గా అప్పట్లో ఒక ట్రెండును కూడా సెట్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు వారి కాంబినేషన్లో శబ్దం అనే సినిమా రాబోతున్నది. ఈ సినిమా కూడా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్గా రావడానికి సిద్ధమయ్యింది.. ఎన్ భానుప్రియ శివ సహా నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ లాంచ్ చేయడం జరిగింది. హీరో వెంకటేష్ చేతుల మీదుగా ఈ టీజర్ ని లాంచ్ చేశారు.


ఆది పినిశెట్టి ఒక హంటెడ్ హౌస్ వద్ద కొన్ని విచిత్రమైన సంఘటనలను చూసినట్టుగా ఈ టీజర్ లో చూపించారు ఇందులో కొన్ని విచిత్రమైన శబ్దాలను కూడా రికార్డు చేసినట్లుగా కనిపిస్తోంది. అసలు విషయాలను రివీల్ చేయకుండా టీజర్ లోనే సినిమాలోని ప్రముఖ నటీనటులందరినీ కూడా ఇందులో చూపించారు. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో తన పాత్రలో చాలా కొత్తగా కనిపించబోతున్నారు. ఆత్మలకు సంబంధించిన కథతో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.


బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను  థమన్ అందించారు. ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ చిత్రంలోని మ్యూజిక్ చాలా కీలకంగా ఉంటుంది. ఇది థమన్ కు ఒక ఛాలెంజింగ్ అని కూడా చెప్పవచ్చు. వైశాలి లో ఎక్కువగా వర్షం , ఆత్మ కనెక్షన్ సన్నివేశాలు చూపించారు.. అయితే ఇందులో శబ్దం తో ఆత్మల కనెక్షన్ ఉన్నట్టుగా చూపించారు.. చాలా సన్నివేశాలు పర్వతాలు మరియు పర్యటక ప్రాంతాలలో తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ముంబై మున్నార్ చెన్నైలోని అనేక ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ చేసినట్టుగా తెలుస్తోంది.అలాగే ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా 120 ఏళ్ల నాటి ఒక లైబ్రరీ సెట్ ను కూడా నిర్మించారు. ఇందులో సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రాజీవ్ మీనన్ తదితరులు నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: