రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'జైలర్‌'. అప్పటి వరకు హిట్‌ సినిమాలు లేని రజనీకాంత్‌కు జైలర్‌తో మంచి విజయాన్ని అందుకున్నారు.గతేడాది అగష్టులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ సాధించింది. నిర్మాతకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్‌ వార్త వైరల్‌ అవుతుంది.జైలర్‌ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌పై కళానిధి మారన్‌ నిర్మించారు. ఈ సినిమాను నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్ట్‌ చేయగా అనిరుధ్‌ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ పనులను డైరెక్టర్‌ ప్రారంభించారట. 'హుకుమ్‌' పేరుతో పార్ట్‌ 2 పనులను ఆయన మొదలుపెట్టేశారట. ఈ జూన్‌లో ప్రీ-ప్రొడక్షన్‌ పనులను కూడా ఆయన స్టార్ట్‌ చేయబోతున్నారని టాక్‌ ఉంది. దీంతో జైలర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి అవుతున్నారు.

 రజనీకాంత్ ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు ఏప్రిల్‌ 22న టైటిల్‌ ఖరారు కానుంది. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో 'వేట్టయాన్‌' చిత్రాన్ని కూడా రజనీ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే.జైలర్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, మలయాళ నటుడు మోహన్‌ లాల్‌, బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌, మిర్నా మేనన్‌, యోగిబాబు కీలక పాత్రల లో మెప్పించారు. టైగర్‌ ముత్తువేల్‌ పాండియన్‌ గా రజనీ హీరోయిజానికి ఫ్యాన్స్‌ ఫిదా అయితే.. వర్మన్‌గా వినాయకన్‌ విలనిజానికి కూడా అదే రేంజ్‌లో విజిల్స్‌ పడ్డాయి. జైలర్‌ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: