టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి వరల్డ్ క్రికెట్లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరిలాగా జట్టులోకి వచ్చి పోయి ఆటగాడిని కాదు చరిత్ర లో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని విరాట్ కోహ్లీ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే నిరూపించాడు అనే చెప్పాలి. ఎంతోమంది లెజెండరీ ప్లేయర్స్ కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను.. అతి తక్కువ సమయంలోనే బద్దలు కొట్టి.. తాను తిరుగులేని లెజెండ్ అన్న విషయాన్ని అందరికీ అర్థం అయ్యేలా చేశాడు.


 కోహ్లీ ఇలాంటి ఆట తీరుని కొనసాగించాడు. కాబట్టి అభిమానులు అందరూ కూడా విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పరుగుల యంత్రం అంటూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఇక విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టుగా.. ఇంకా దాహం తీరలేదు అన్నట్లుగా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. భారీగా పరుగులు చేస్తూ ఆకట్టుకుంటూనే ఉన్నారు అని చెప్పాలి. ఇక 2024 ఐపిఎల్ సీజన్ లో కూడా ఆ జట్టు గెలుపు ఓటమితో సంబంధం లేకుండా.. విరాట్ కోహ్లీ మాత్రం వ్యక్తిగత ప్రదర్శన విషయంలో ఆకట్టుకుంటున్నాడు.


 కాగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఢిల్లీతో జరగబోయే మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు అంటే చాలు ప్రొఫెషనల్ క్రికెట్లో ఏకంగా 100 సెంచరీల మార్క్ చేరుకోబోతున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 36 సెంచరీలు లిస్ట్ ఎ లో 54 సెంచరీలు, టి20 లలో 9 సెంచరీలు చేసి మొత్తంగా 99 సెంచరీల వద్ద ఉన్నాడు. నేటి మ్యాచ్లో సెంచరీ చేశాడు అంటే ప్రొఫెషనల్ క్రికెట్లో ఏకంగా 100 సెంచరీలు చేసిన ప్రేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు. అయితే గత మ్యాచ్లో కేవలం ఏడు పరుగుల దూరంలో సెంచరీని మిస్ చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: