ఆముదం పేగుల్లో మలాన్ని సులువుగా కదిలేలా చేస్తుంది.ముఖ్యంగా పేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉండడం వల్ల పేగు గోడలను ప్రేరేపించి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో మనకు సమర్థవంతంగా సహాయపడుతుంది.. అయితే ఆముదాన్ని పెద్ద మొత్తంలో తీసుకుంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఆముదం తీసుకుంటే అతిసారం, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు కూడా ఆముదాన్ని తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే వైద్యులను సంప్రదించి తీసుకోవడం మరింత మంచిది.
ఇకపోతే ఈ మలబద్ధకం సమస్యతో మీరు కూడా బాధపడుతూ ఉంటే ఆముదంతో ఈ చిన్న చిట్కా పాటిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ముందుగా ఒకటి లేదా రెండు చెంచాల ఆముదం ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు ఖాళీ కడుపుతో తీసుకోవాలి లేదా ఆముదాన్ని పండ్ల రసం లేదా తేనెతో కలిపి తీసుకున్న సరిపోతుంది. ముఖ్యంగా ఆముదం అనేది రుచికి చేదుగా ఉంటుంది కాబట్టి పాలు లేదా తేనె వంటి వాటిలో కలుపుకొని తినవచ్చు.. అయితే మీలో ఎవరైనా సరే ఆముదం తీసుకోవాలనుకుంటే వైద్యుల సూచనలు పాటించడం తప్పనిసరి. ఇక అంతేకాదు సరిపడా నీరు తాగాలి .. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.. పరగడుపున గోరువెచ్చని నీరు తాగాలి.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి . ఇలాంటివి చేస్తే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి